ఇట్స్ అఫీషియల్.! లావణ్య త్రిపాఠి.. మెగా కోడలైపోతోందోచ్.!

- June 09, 2023 , by Maagulf
ఇట్స్ అఫీషియల్.! లావణ్య త్రిపాఠి.. మెగా కోడలైపోతోందోచ్.!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కీ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీకీ మధ్య ఏదో వుందంటూ జరుగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లే అనిపిస్తోంది. జూన్ 9న వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ ఫిక్సయినట్లుగా ఇటీవల తాజా ఖబర్ ఒకటి గట్టిగా వినిపించింది.
ఎప్పటిలాగే కొందరు దాన్నీ లైట్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ ఖబర్ నిజమే అని ఓ ప్రెస్ నోట్ రిలీజైంది. ఇంకేముంది.! ఇంతవరకూ గాచిప్స్‌లో వున్న ఈ జంట యవ్వారం నిజమే అని తేలిపోయింది.
నిజంగానే లావణ్యతో వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ జరగనుంది. లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కానుంది. మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత వీళ్లిద్దరి విషయంలో నిజమై కూర్చుంది. లవ్వూ, డేటింగ్.. ఇలాంటి ఇష్యూస్ అన్నింటికీ టాటా బైబై చెప్పేసినట్లే.
ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవల ‘పులి మేక’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com