తెలంగాణలో లక్ష మందితో బిజెపి భారీ బహిరంగ సభ..
- June 10, 2023
హైదరాబాద్: తెలంగాణ ఫై బిజెపి పూర్తి ఫోకస్ పెట్టింది. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో బిజెపి అధిష్టానం దూకుడు పెంచింది. ఇప్పటికే పలు సభలు , సమావేశాలు ఏర్పటు చేసిన బిజెపి ..తాజాగా ఈ నెల 15 న ఖమ్మం లో భారీ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకాబోతున్నారు.
ఈ సభ కోసం ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా నేతలు పరిశీలించారు. అమిత్‌షా తొలిసారిగా ఖమ్మంలో పర్యటిస్తుండటంతో ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని.. అందుకే సువిశాల ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని పేర్కొన్నారు.
మరోపక్క ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినప్పటికీ వారు మాత్రం బీఆర్ఎస్ చెంతకే చేరుతున్నారని ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..









