చిరు లీక్స్.! మెగా పండగ ఇప్పుడే వచ్చేసింది.!

- June 10, 2023 , by Maagulf
చిరు లీక్స్.! మెగా పండగ ఇప్పుడే వచ్చేసింది.!

చిరంజీవి నోట్లో ఏదీ దాగదు. అది అనూహ్యంగా జరుగుతుందో.. లేక చిరంజీవి అలా చేయడం వల్లే ఆయా సినిమాలకు విపరీతమైన హైప్ వస్తుందో తెలీదు కానీ, కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయ్ అంతే. అలా జరిగిపోయే వాటికే అభిమానులు ‘చిరు లీక్స్..’ అని ముద్దు పేరు పెట్టేసుకుని అవి ఎప్పుడెప్పుడొస్తాయా.? అని ఈగర్‌గా వెయిట్ చేసేస్తుంటారు. 
తాజాగా చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ నుంచి ఓ మేకింగ్ వీడియో అలాగే రిలీజ్ చేసి, చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ వీడియోని రిలీజ్ చేసే ముందగా చిరంజీవి సోషల్ మీడియాలో ఓ స్సెషల్ ఆడియో రిలీజ్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. 
ఆ తర్వాత తన ఇన్‌స్టా హ్యాండిల్ నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరోయిన్లు కీర్తి సురేష్, తమన్నాలతో కలిసి చిరంజీవి చేస్తున్న రచ్చ మెగా ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్‌లా వుంది.
ఓ సాంగ్ మేకింగ్ వీడియో ఇది. ఈ వీడియోలో భారీ సెట్.. సెట్‌లో బోలెడంత మంది టీమ్ మెంబర్లు.. సాంగ్‌కి డాన్స్ కంపోజ్ చేస్తున్న శేఖర్ మాస్టర్ తదితరులు కనిపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com