అనసూయా.! రౌడీకి అంత అవసరం లేదమ్మా.!
- June 10, 2023
అనసూయని ట్రోల్ చేయించడానికి ఏకంగా విజయ్ దేవరకొండ ఓ టీమ్‌ని సెట్ చేశాడట. డబ్బులిచ్చి మరీ ఆ టీమ్‌తో అనసూయని ట్రోల్ చేయించడమే పనిగా పెట్టుకున్నాడట.. ఇదీ విజయ్ దేవరకొండపై అనసూయ చేస్తున్న ఆరోపణలు.
ఈ మధ్య విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ అనసూయ సోషల్ మీడియా వేదికగా అవాకులు చవాకులూ పేలుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ మరికొన్ని ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి చేసిన ఆరోపణలు కాస్త చిత్రంగా ఒకింత విచిత్రంగా వున్నాయ్.
అంత పని గట్టుకుని అనసూయని ట్రోల్ చేయించాల్సినంత అవసరం విజయ్‌కి ఎందుకు.? అసలింతవరకూ అనసూయని విజయ్ దేవరకొండ ఏమీ అనిందే లేదు. ఎక్కడా ఆమె ప్రస్థావన ఆయన తెచ్చిందే లేదు.
పబ్లిసిటీ స్టంట్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండని కెలికితే తనకి రావల్సినంత పబ్లిసిటీ దక్కుతుందనుకుందో ఏమో అనసూయ. అయితే, తాజాగా విజయ్ దేవరకొండతో కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది.
విజయ్‌కే తెలియకుండా ఎవరో ఇలా తనపై ట్రోల్స్ చేస్తున్నారంటూ విజయ్‌ని ఈ వివాదం నుంచి పక్కకి నెట్టేసి.. టోటల్‌గా వివాదానికి చెక్ పెట్టేసినట్లు అర్ధమవుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







