సినిమా రివ్యూ: ‘అన్ స్టాపబుల్’
- June 10, 2023
నటీనటులు:
విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు తదితరులు.
దర్శకుడు: డైమండ్ రత్నబాబు
నిర్మాతలు: రంజిత్ రావు
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
రీసెంట్‌గా ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన బిగ్‌బాస్ విన్నర్ వీజె సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. ఈ మధ్య బాలయ్య చేసిన ఓటీటీ ప్రోగ్రాం ద్వారా ఈ ‘అన్ స్టాపబుల్’ పేరు బాగా పాపులర్ అయిపోయింది.
ఇదే టైటిల్‌గా పెట్టుకుని అన్‌స్టాపబుల్ కామెడీ అంటూ సినిమాని తెరకెక్కించారు. సినిమాలో తారాగణం పరంగా అవును నిజమే ఎంటర్‌టైన్‌మెంట్ అన్‌స్టాపబుల్ అనేంతలాగే వుంటుందని అనుకోవడం అతిశయోక్తి కాదు. మరి, నిజంగానే అంతలా ‘అన్‌స్టాపబుల్’ ఆకట్టుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
కోహినూర్ కళ్యాణ్ (సన్నీ), జిలాని రామదాస్ (సప్తగిరి) తమ చెల్లెలి పెళ్లి కోసం దాచుకున్న డబ్బును క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకుంటారు. పెళ్లి దగ్గర పడడంతో ఆ డబ్బు కోసం మరో ఫ్రెండ్ సాయం కోరతారు. ఆ ఫ్రెండ్ డబ్బుని ఆన్ లైన్ ట్రాన్సేషన్ ద్వారా స్నేహితులకి పంపిస్తాడు. కట్ చేస్తే ఆ డబ్బు చేరాల్సిన వాళ్లకి చేరకుండా మరో వ్యక్తికి చేరుతుంది. ఆ వ్యక్తి ఓ పెద్ద డాన్ కావడంతో సన్నీ అండ్ కో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ డాన్ నుంచి తమ డబ్బు తాము తిరిగి తెచ్చుకునే క్రమంలో కోహినూర్ కళ్యాణ్, జిలాని రామదాస్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.? ఈ క్రమంలో పుట్టిన కామెడీ ఎలా వుంది.? అనేది మిగతా కథ. అది తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
సన్నీ మంచి హ్యూమరస్ వున్న నటుడు. అలాగే సప్తగిరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన టైమింగ్‌కి ఆయనే సాటి. అయితే హీరోయిజం ఎలివేట్ చేయాలన్న వుద్దేశ్యంతో చేయాల్సిన కామెడీ టైమింగ్స్ మిస్ చేసుకున్నారీ ఇద్దరు. సినిమాలో వీరితో పాటూ, ఇంకా చాలా మంది ఆర్టిస్టులున్నారు. అందరూ కామెడీ దిగ్గజాలే. కానీ పండాల్సిన స్థాయిలో కామెడీ పండనే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. హీరోయిన్ పాత్రకు పెద్దగా ఇంపార్టున్స్ లేదు. మిగిలిన పాత్రధారులంతా జస్ట్ ఓకే అనిపిస్తారు.
సాంకేతిక వర్గం పని తీరు:
డైలాగ్ రైటర్ అయిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు. హీరోలకీ, విలన్లకు మధ్య వచ్చే కాంప్లిక్ట్ పాయింట్‌ని ఆడియన్స్‌కి హ్యూమరస్‌గా కనెక్ట్ చేయడంలో కాస్త లాజిక్ మిస్సయ్యాడు. లాజిక్కులు వెతక్కపోయినా, ఓ మినిమమ్ రేంజ్ కామెడీ సినిమాకి వుండాల్సిన కామెడీని కూడా ఈ సినిమాలో చూపించలేకపోయాడు. భీమ్స్ మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ కత్తెరకు చాలా పదును పెట్టాల్సి వుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే. మిగిలిన సాంకేతిక వర్గం తమ పరిధి మేర ఓకే అనిపిస్తారు.
ప్లస్ పాయింట్స్:
సన్నీ, సప్తగిరి ఈ సినిమాని తమ భుజాలపై మోసే ప్రయత్నం మ్యాగ్జిమమ్ ట్రై చేశారు. వారిద్దరికీ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ఓకే అనిపిస్తాయ్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, కడుపుబ్బా నవ్వించాల్సిన కొన్ని సీన్లయితే, కళ్లు తేలబెట్టేలా బోర్ కొట్టిస్తాయ్.
స్ర్కీన్ నిండా పుష్కలంగా కామెడీ ఆర్టిస్టులతో నిండిపోయినా నవ్వించడంలో నిండా ముంచేశారు.
టెక్నికల్ టీమ్ పని తనం కూడా అంతంత మాత్రమే అనే అభిప్రాయాలున్నాయ్.
చివరిగా.!
తెర నిండా కామెడీ ఆర్టిస్టులే కాబట్టి.! వాళ్ల పనితనం ఆల్రెడీ తెలుసు కాబట్టి. జస్ట్ ఒక్కసారి చూసి ఆనందించేయొచ్చు. కానీ లిమిటెడ్ ఆనందమే సుమా.! టైటిల్‌కి తగ్గట్లు ‘అన్ స్టాపబుల్ ’ హండ్రెడ్ పర్సంట్ ఎంత మాత్రమూ కాదమ్మా.!
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!