వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వద్దు..!

- June 11, 2023 , by Maagulf
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వద్దు..!

దోహా, ఖతార్: వేసవి నెలల్లో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, వేసవి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) కోరింది. ఈ కార్మిక మంత్రిత్వ శాఖతో కలిసి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అనేక భద్రతా చర్యలు, జాగ్రత్తలను జారీ చేసింది. వేసవిలో ఉష్ణోగ్రతలు, తేమ పెరగడంతో పని ప్రదేశాల వద్ద ఎండ సంబంధిత సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ఇండోర్ ప్రదేశాలలో పనిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, కార్మికులు వేడిని తట్టుకునే శక్తిని పెంచుకోవాలని సూచించింది. పని సమయంలో తరచూ విరామాలు తీసుకోవాలని తెలిపింది.

ప్రథమ చికిత్స దశలను మరియు వేసవిలో తలెత్తే అనారోగ్యానికి సంబంధించిన వైద్య అత్యవసర సంకేతాలను తెలియజేసింది. వడదెబ్బకు గురైన వారిలో అసాధారణమైన ఆలోచన లేదా ప్రవర్తన, అస్పష్టమైన ప్రసంగం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి వైద్య అత్యవసర సంకేతాలు కనిపిస్తాయని పేర్కొంది. ఏవైనా ఇతర సంకేతాలను గమనించి, త్వరగా వైద్య సహాయాన్ని పొందాలని ప్రజలను కోరింది. తలనొప్పి లేదా వికారం, బలహీనత లేదా మైకము, విపరీతమైన చెమట లేదా వేడి, పొడి చర్మం, పెరిగిన శరీర ఉష్ణోగ్రత, దాహం మరియు మూత్రం తగ్గడం వంటివి కనిపిస్తే సదరు వ్యక్తికి త్రాగడానికి నీరు ఇవ్వాలని, అనవసరమైన దుస్తులు తొలగించి, వీలయినంత త్వరగా ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని సూచించింది.  ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితిలో ప్రజలు వెంటనే 999కి కాల్ చేయాలని, వెంటనే నీరు లేదా ఐస్‌తో కార్మికుడిని చల్లబరచాలని మరియు సహాయం వచ్చే వరకు కార్మికుడితో ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com