సీనియర్ సిటిజన్ ను బురిడికొట్టించిన స్కామర్స్.. ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష

- June 11, 2023 , by Maagulf
సీనియర్ సిటిజన్ ను బురిడికొట్టించిన స్కామర్స్.. ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష

బహ్రెయిన్: మోసపూరిత టెక్స్ట్ మెసేజ్ స్కామ్ ద్వారా 60 ఏళ్ల వ్యక్తిని BD500 మోసం చేసినందుకు దోషిగా తేలిన ఇద్దరు ఆసియా వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు వారికి ఒక్కొక్కరికి BD5,000 జరిమానా విధించింది. వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత, వారు దేశం నుండి బహిష్కరించాలని తీర్పులో పేర్కొంది. బాధితుడికి మోసపూరిత లింక్‌తో కూడిన ఫోన్ సందేశం అందడంతో, అతని బ్యాంక్ కార్డ్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని అందించాడు.దీంతో బాధితుడికి తెలియకుండా అతని బ్యాంక్ ఖాతా నుండి BD500ని అనధికారికంగా దొంగిలించారు. అయితే, తాను స్కామ్‌కు గురయ్యానని తెలుసుకున్న వ్యక్తి వెంటనే తన నిధులను రికవరీ చేయాలని కోరుతూ యాంటీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు డబ్బును కాజేసిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారు మోసపూరిత కార్యకలాపాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వైర్ ఫ్రాడ్, దొంగతనం, మనీ లాండరింగ్ వంటి అభియోగాలు మోపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com