తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం..
- June 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం (జూన్12,2023) రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు.
జంట నగరాల్లో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి. ప్రతి నెల నాలుగో శనివారం నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. త్వరలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు. అలాగే, ఈ ఏడాది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందించనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







