హైదరాబాద్లో ఈ సమావేశాలు జరుగుతాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 12, 2023
హైదరాబాద్: భారత దేశంలో జీ 20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అనేక అంశాలపై చర్చలకు భారత్ వేదికైందని తెలిపారు. 46 రంగాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 75 శాతం గ్లోబల్ ట్రేడ్ జీ20 దేశాల నుంచి జరుగుతోందని తెలిపారు.
హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా ఈ నెల 15 నుంచి 17వరకు జరిగే సమావేశాలకు జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ లో జీ20లో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటుందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19, 20, 21, 22 తేదీల్లో గోవాలో జరుగుతాయని తెలిపారు.
గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్ ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాంస్కృతిక శాఖ తుది సమావేశాలు వారణాసిలో జరుగుతాయని వివరించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







