వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను: ఆర్జీవీ
- June 13, 2023
హైదరాబాద్: సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఆర్జీవీ ముందు నుంచి కూడా ఏపీ సీఎం జగన్ కు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మరో పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు.
ఇటీవల జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను తీస్తాను అని, రెండు పార్టులుగా తీసి ఎలక్షన్స్ టైంకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. ఈ సినిమాకు జగన్ పార్టీకి చెందిన వ్యక్తులే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. తాజాగా ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. నా కెరీర్ లో రాజకీయ సినిమాలు కేవలం సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే చేశాను. ఇప్పుడు వ్యూహం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కేవలం ఎలక్షన్స్ సమయంలోనే సేల్ అవుతాయి. అందుకే వ్యూహం సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ అయిదేళ్ల వరకు పొలిటికల్ సినిమాలు తీయను. వ్యూహం సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వ్యూహం 2 సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అని తెలిపారు.
ఇక వ్యూహం సినిమా కథ గురించి చెప్తూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ని తొక్కేయాలనుకున్నారు. కొందరు కుట్రలు చేశారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లోచూపిస్తాను. ఈ సినిమాకు మొదట కుట్ర అనే టైటిల్ అనుకున్నాను కానీ చీప్ గా ఉంటుందని తర్వాత వ్యూహంగా మార్చాను. వ్యూహం 2 లో జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన అంశాల గురించి, జగన్ పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది అని తెలిపారు ఆర్జీవీ.
గత ఎలక్షన్స్ సమయంలో ఆర్జీవీ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాగే ఈ వ్యూహం సినిమాలు కూడా క్లిక్ అవుతాయా? ఎలక్షన్స్ సమయంలో జగన్ కి ఇవి పని చేస్తాయా చూడాలి. ఇటీవల వ్యూహం సినిమా గురించి ఆర్జీవీ వరుస పోస్టులు పెడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా చర్చగా మారింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







