32 మిలియన్ దిర్హామ్‌ల ఆన్‌లైన్ స్కామ్: 30 మంది సభ్యుల ముఠాకు 96 ఏళ్ల జైలు
- June 13, 2023
యూఏఈ: వ్యక్తులు, కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ స్కామ్ కు పాల్పడి32 మిలియన్ దిర్హామ్‌లను అపహరించిన కేసులో 30 మంది సభ్యుల ముఠా, ఏడు కంపెనీలు దోషులుగా తేలాయి. దుబాయ్‌లోని మనీలాండరింగ్ కోర్టు ముఠాలోని 30 మంది సభ్యులకు కలిపి మొత్తం 96 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. 32 మిలియన్ దిర్హామ్‌ల జరిమానాను ఉమ్మడిగా చెల్లించాలని నిందితులను కోర్టు ఆదేశించింది. నేరానికి ఉపయోగించిన కంప్యూటర్లు, ఫోన్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏడు కంపెనీలకు కలిపి మొత్తం Dh700,000 జరిమానా విధించింది. జరిమానాను కవర్ చేయడానికి కోర్టు ప్రతివాదులకు చెందిన నిధులు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చని తెలిపింది. బాధితులకు 118,000 ఫిషింగ్ ఇమెయిల్‌లను పంపడం ద్వారా ముఠా డబ్బును దొంగిలించిందని సీనియర్ అడ్వకేట్ జనరల్ మరియు పబ్లిక్ ఫండ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ కౌన్సెలర్ ఇస్మాయిల్ మదానీ చెప్పారు.
మనీలాండరింగ్ నేరాలను పరిశోధించడానికి యూఏఈ ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. వామ్ నివేదిక ప్రకారం, నవంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు చట్ట అమలు సంస్థలు 122 కొత్త కేసులను నమోదుచేశాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 109 కేసులను విచారించారు. ఈ కాలంలో యూఏఈ మనీలాండరింగ్ కేసులలో 94 శాతం నేరారోపణ రేటును కొనసాగించింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







