ఎయిర్ ఏషియా వారి 'బిగ్ సేల్'

- June 22, 2015 , by Maagulf
ఎయిర్ ఏషియా వారి 'బిగ్ సేల్'

ఎయిర్ ఏషియా ఇండియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.అన్ని చార్జీలతో సహా విమాన టిక్కెట్ ను 799 రూపాయలకే విక్రయిస్తోంది. ఈ 'బిగ్ సేల్' ఆఫర్ ఈ నెల 28 వరకు మాత్రమే ఉంటుంది.కాగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు 2016 ఫిబ్రవరి 15, 2016 ఆగస్టు 31 మధ్య ప్రయాణించాలి.బెంగళూరు నుంచి కోచికి విమాన టిక్కెట్ ధర 799 రూపాయలు.ఇక బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖపట్నం టిక్కెట్ ధరలను 999 రూపాయలుగా నిర్ణయించారు. బెంగళూరు-ఢిల్లీ విమాన టిక్కెట్ ధర 1999 రూపాయలు.పలు విమానయాన సంస్థలు ప్రయాణకులను ఆకర్షించేందుకు కోసం ఆఫర్లను ప్రకటించాయి.ఇటీవల ఎయిరిండియా ప్రమోషనల్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది.1777 రూపాయల నుంచి టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచింది.ఇతర విమానయాన సంస్థుల ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com