డోనస్కీపై రష్యా దళాలు దాడి.. ముగ్గురు మృతి
- June 14, 2023
కీవ్: ఈరోజు తెల్లవారుజామున రష్యా దళాలు డోనస్కీపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. రాకెట్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు డోనస్కీ మిలిటరీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. డోనస్కీ, ఒడిసా నగరాల్లో భారీ నష్టం జరిగిందని, డజన్ల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమైనట్లు కిరిలెంకో చెప్పారు. డోనస్కీని టార్గెట్ చేస్తూ రష్యా ఆరు కేహెచ్-22 క్రూయిజ్ మిస్సైళ్లను వదిలినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
మరోవైపు జర్మనీలో నాటో దళాలు ఏరియల్స్ డ్రిల్స్ నిర్వహించాయి. వందల సంఖ్యలో యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగిరాయి. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నాటో దళాలు ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. మొత్తం 250 యుద్ధ విమానాలతో ప్రదర్శన నిర్వహించారు. దీంట్లో 190 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పదివేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇవాళ రష్యా 20 మిస్సైళ్లు, డ్రోన్లు లాంచ్ చేసిందని, దాంట్లో 12 ఏరియల్ వెహికిల్స్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







