నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్
- June 15, 2023
ముంబయి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నాగ్‌పూర్ పట్టణమంతా బిఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కెసిఆర్ ముఖచిత్రంతో కూడిన ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







