అక్టోబర్ 2024 వరకు US వీసా అపాయింట్‌మెంట్‌లు లేవు..!
- June 17, 2023
యూఏఈ: వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం నిరీక్షణ సమయాలు కొనసాగుతున్నందున UAE నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాలని యోచిస్తున్న నివాసితులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ 2024 వరకు US వీసా అపాయింట్‌మెంట్‌లు అందుబాటులో లేవని, వచ్చే ఏడాది అక్టోబర్‌లో అందుబాటులో ఉంటాయని ట్రావెల్ పరిశ్రమ నిపుణులు తెలిపారు. "ప్రస్తుతం B1, B2 US విజిట్ వీసాల కోసం వేచి 2024 సెప్టెంబర్ వరకు వేచి ఉండాల్సిందే. " అని రిజాయిస్ ట్రావెల్ అండ్ టూరిజం జనరల్ మేనేజర్ ధాస్ ఆంథోనీ అన్నారు. కోవిడ్ తర్వాత వీసా దరఖాస్తుల సంఖ్య పెరిగిందని, దీంతో అపాయింట్‌మెంట్ స్లాట్ సమయం పెరిగిందన్నారు.
US వీసా కోసం దరఖాస్తు
US విజిట్ వీసాలలో రెండు రకాలు ఉన్నాయి: “వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణిస్తున్నట్లయితే US వ్యాపార వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఈ వీసాని బి1 వీసా అని కూడా అంటారు. మరియు టూరిజం కోసం టూరిస్ట్ వీసా మరియు దీనిని B2 వీసా అని కూడా పిలుస్తారు, ”అని ఆంథోనీ అన్నారు.
సందర్శన వీసా ఒక వ్యక్తి USలోకి ప్రవేశించడానికి మరియు ఆరు నెలల వరకు అక్కడ ఉండడానికి వీలు కల్పిస్తుంది. DS-160 ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయడం ద్వారా పొందవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..