డిజిటల్ టెక్నాలజీ హబ్‌గా ఖతార్..!

- June 17, 2023 , by Maagulf
డిజిటల్ టెక్నాలజీ హబ్‌గా ఖతార్..!

దోహా, ఖతార్: ఖతార్ లో డిజిటల్ టెక్నాలజీ హబ్‌లో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల స్థిరత్వం, భద్రత, లాభదాయకత లభిస్తాయని IPA ఖతార్‌లోని ఇన్వెస్టర్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ ఫహద్ అలీ అల్ కువారి తెలిపారు. పెరల్ ఐలాండ్‌లో Huawei కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా .. ఖతార్ అన్ని వ్యాపారాలను స్వాగతిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్ రంగంలో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి దేశం ఒక ఓపెన్ డోర్ అని చెప్పారు.  విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మార్కెట్‌లో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు.  హువావేలోని గల్ఫ్ నార్త్ రిప్రజెంటేటివ్ కార్యాలయంలోని చీఫ్ సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ ఆఫీసర్ కమల్ జియాన్ తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఖతార్ సురక్షితమైన దేశాలలో ఒకటి అని వ్యాఖ్యానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com