సౌదీ చేరుకున్న వ్యోమగాములు రయ్యానా బర్నావి, అలీ అల్కర్నీ

- June 17, 2023 , by Maagulf
సౌదీ చేరుకున్న వ్యోమగాములు రయ్యానా బర్నావి, అలీ అల్కర్నీ

రియాద్: సౌదీ వ్యోమగాములు అలీ అల్కర్నీ, రయ్యానా బర్నావి, మరియం ఫర్దౌస్,  అలీ అల్-గమ్ది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతమైన శాస్త్రీయ మిషన్ తర్వాత శనివారం ఉదయం రాజ్యానికి తిరిగి వచ్చారు. అల్కర్నీ, బర్నావి - భూమిని కక్ష్యలోకి వెళ్లిన మొదటి అరబ్ మహిళగా రికార్డులు సృష్టించారు. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజుల బస తర్వాత మే 31న భూమికి తిరిగి వచ్చారు. అక్కడ వారు మైక్రోగ్రావిటీపై 14 పరిశోధన ప్రాజెక్టులు చేశారు. వాటిలో మూడు ప్రాజెక్టులను సౌదీలోని  47 ప్రాంతాల నుండి 12,000 మంది పాఠశాల విద్యార్థులతో చేపట్టారు. ‘‘శాస్త్రీయ మిషన్ మానవాళికి గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుంది. అంతరిక్ష పరిశోధనలో కింగ్‌డమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.’’ అని కింగ్ ఖలేద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యోమగాములు రాక సందర్భంగా సౌదీ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మద్దతుతో సౌదీ అంతరిక్ష యాత్ర ప్రముఖ విజయాలను నమోదు చేస్తుందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com