90% మంది విద్యార్థులలో పాఠశాల స్థాయిలోనే కెరీర్ ఆలోచనలు
- June 17, 2023
యూఏఈ: హైస్కూల్ విద్యార్థులు (15- నుండి 18 సంవత్సరాల వయస్సు గలవారు) ఇప్పటికే వారి వృత్తిపరమైన ఆకాంక్షలపై దృష్టి సారించారు. దాదాపు 40% మంది వ్యాపారం మరియు ఆరోగ్య సంరక్షణలో వెళ్లాలని యోచిస్తున్నారు. విద్యార్థుల కెరీర్ ఆకాంక్షలు, భవిష్యత్తుపై విడుదల చేసిన KPMG-GEMS విద్యా నివేదికలో ఈమేరకు తెలిపారు. "మైండ్ ది గ్యాప్" పేరుతో వెలువడిన నివేదిక యూఏఈలోని 800 కంటే ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను వారి కెరీర్ లక్ష్యాలు, ప్రభావాలు, అడ్డంకుల గురించి సర్వే చేసింది. యూఏఈ ప్రభుత్వం యువతను తన గొప్ప ఆస్తిగా చూస్తోందని నివేదిక పేర్కొంది. విద్యార్థులు కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్, సోషల్ స్కిల్స్ మరియు లీడర్‌షిప్ హై మార్కులను వారు భవిష్యత్ ఉద్యోగ విజయానికి అత్యంత ముఖ్యమైనవిగా భావించిన నైపుణ్యాలుగా చెప్పారు. చాలా మంది సాంకేతికత, సమాచారం మరియు మీడియా అక్షరాస్యతను తమ భవిష్యత్తు విజయానికి కీలకంగా పరిగణించలేదు.
రాష్ట్ర ఉన్నత విద్య, అధునాతన నైపుణ్యాల మంత్రి సలహాదారు డాక్టర్ ఫైసల్ అల్ హమ్మదీ.. GEMS ఎడ్యుకేషన్‌లో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డినో వర్కీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమిలియో పెరా సమక్షంలో GEMS మోడ్రన్ అకాడమీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నివేదికను ఆవిష్కరించారు.
బిజినెస్ టాప్ ఛాయిస్: నివేదిక ప్రకారం.. చాలా మంది విద్యార్థులు వ్యాపారాన్ని (21%), ఆ తర్వాత హెల్త్‌కేర్ (20%), ఇంజినీరింగ్ (12%), క్రియేటివ్ ఆర్ట్స్ 6%) కొనసాగించాలని యోచిస్తున్నారు. మగ విద్యార్థులకు (29%) వ్యాపారం అగ్ర ఎంపికకాగా, మహిళా విద్యార్థులలో (24%) ఆరోగ్య సంరక్షణకు ఓటు వేసారు. 1% కంటే తక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అధ్యయనం చేయాలని ప్లాన్ చేసారు. కేవలం 5% మంది మాత్రమే సహజ శాస్త్రాలను అధ్యయనం చేయాలని కోరుకుంటున్నారు. 4% మహిళా విద్యార్థులు, 14% మంది మగ విద్యార్థులు ITలోకి వెళ్లాలని యోచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం