బాలయ్య - బాబీ కాంబో.! సంక్రాంతి టార్గెట్ నిజమేనా.?
- June 17, 2023
గత సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహారెడ్డి’గా వచ్చి సూపర్ హిట్ కొట్టారు. డైరెక్టర్ బాబీ ‘వాల్తేర్ వీరయ్య’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక, ఈ సంక్రాంతిని సైతం వీరిద్దరూ టార్గెట్ చేస్తున్నారట. అయితే, ఈ సారి కలిసి టార్గెట్ చేస్తున్నారనీ తెలుస్తోంది.
అదేనండీ.! బాబీ డైరెక్షన్‌లో బాలయ్య ఓ సినిమా కన్‌ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అతి త్వరలోనే పట్టాలెక్కించి, వీలైనంత త్వరగా పూర్తి చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. అలా సంక్రాంతి బరిలో ఈ సినిమాని దించాలని అనుకుంటున్నారట.
అయితే, ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లే. దసరా రిలీజ్‌కి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, బాబీ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట బాలయ్య. టైమ్ తీసుకోకుండానే ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
స్టార్ హీరోలు, యంగ్ హీరోలనే తేడా లేకుండా, యమ హుషారుగా వున్నారు బాలయ్య. బాలయ్య జోరుకు అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







