తెలంగాణలో వడగాలులు..
- June 18, 2023
హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు వీయనున్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు వాతావరణం కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
రాగల రెండు రోజులు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







