ఇంకోస్సారి ఎపిక్ మూవీ ప్లాన్‌లో మెగాస్టార్.!

- June 19, 2023 , by Maagulf
ఇంకోస్సారి ఎపిక్ మూవీ ప్లాన్‌లో మెగాస్టార్.!

సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ మూవీగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో ఎపిక్ మూవీలో నటించాలని చిరంజీవి అనుకుంటున్నారట. అయితే అది ఎలాంటి ఎపిక్ అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ, ఆ తరహా స్టోరీ కోసం ధర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో వున్నారట.

ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా వున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయ్. ఈ లోగా మరో రెండు ప్రాజెక్టులు మెగాస్టార్ లైన్‌లో పెట్టారు. అలాగే, ఈ లిస్టులో ఓ రీమేక్ మూవీ కూడా వుందంటున్నారు. అదో మలయాళ రీమేక్ అనీ తెలుస్తోంది. ఎప్పటి నుంచో ‘బ్రోడాడీ’ రీమేక్‌లో చిరంజీవి నటిస్తారట అనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ ఆ రీమేక్‌పై క్లారిటీ రాలేదు. 

తాజాగా ఆ సినిమా రైట్స్‌ని చిరంజీవి తనయ సుస్మిత కొనుగోలు చేయడంతో, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com