250 స్పోర్ట్స్ వీసాలను జారీ చేసిన కువైట్

- June 20, 2023 , by Maagulf
250 స్పోర్ట్స్ వీసాలను జారీ చేసిన కువైట్

కువైట్: క్రీడలు, సాంస్కృతిక లేదా సామాజిక కార్యకలాపాల కోసం కువైట్‌లోకి ప్రవేశించడానికి కొత్త రకం వీసాను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నివాస వ్యవహారాల శాఖ అనేక క్రీడా క్లబ్‌లు, సంబంధిత సంఘాల నుండి సుమారు 1,000 దరఖాస్తులను స్వీకరించింది. అల్-రాయ్ రోజువారీ నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు అన్ని షరతులను కలిగి ఉన్న సుమారు 250 స్పోర్ట్స్ వీసాలు జారీ చేశారు. అంతకుముందు అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ స్పోర్ట్స్ వీసా హోల్డర్‌కు రెసిడెన్సీ వ్యవధిని మూడు నెలలుగా పేర్కొంది. దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఒక సంవత్సరానికి మించని కాలానికి పునరుద్ధరించబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com