ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలలో యూఏఈ
- June 21, 2023
యూఏఈ: ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలలో యూఏఈ ఒకటిగా నిలిచింది. మంగళవారం విడుదల చేసిన IMD వరల్డ్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ 2023 ప్రకారం..యూఏఈ రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచంలోని టాప్ 10 అత్యంత పోటీ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా స్థానం సంపాదించింది. ఈ ఘనతపై యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మార్గదర్శకంలో యూఏఈ ప్రజల చిత్తశుద్ధితోనే ఉన్నత ర్యాంకు సాధ్యమైందని తెలిపారు. మేనేజ్మెంట్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ సామర్థ్యం వంటి అనేక సూచికలలో యూఏఈ ప్రపంచానికి అగ్రగామిగా ఉందని షేక్ మహ్మద్ అన్నారు.
ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణ కొరియా, యూకే, ఫ్రాన్స్ మరియు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇప్పుడు ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ మరింత పోటీగా తయారైంది. సూచీలలో యూఏఈ 'ఆర్థిక పనితీరు' 6 నుండి 4వ స్థానానికి ఎగబాకింది. 'వ్యాపార సామర్థ్యం' 17 నుండి 16కి మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా డెన్మార్క్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. వరుసగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, నెదర్లాండ్స్, తైవాన్, హాంకాంగ్, స్వీడన్, అమెరికా, యూఏఈ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని గల్ఫ్ ప్రాంతీయ దేశాలు తమ ర్యాంకింగ్స్‌లో మెరుగుదల నమోదు చేశాయి. ఖతార్ 18 ర్యాంక్ (6 స్థానాలు పైకి), సౌదీ అరేబియా 17 (7 స్థానాలు పైకి), బహ్రెయిన్ 25 (5 ర్యాంక్)తో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 38వ ర్యాంక్‌లో ఉన్న కువైట్ ర్యాంకింగ్‌లో తాజాగా చేరింది.
తాజా వార్తలు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!









