టైటానిక్ సబ్‌మెర్‌సిబుల్‌ను గుర్తించిన అమెరికా కోస్ట్ గార్డ్..!

- June 21, 2023 , by Maagulf
టైటానిక్ సబ్‌మెర్‌సిబుల్‌ను గుర్తించిన అమెరికా కోస్ట్ గార్డ్..!

యూఏఈ: తప్పిపోయిన టైటానిక్ సబ్‌మెర్‌సిబుల్‌ నుంచి ఉత్తర అట్లాంటిక్‌లో నీటి అడుగున సోనార్‌"బ్యాంగ్" శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. ఆదివారం సబ్‌మెర్‌సిబుల్‌ తప్పిపోయన విషయం తెలిసిందే. కాగా, వారి ఆచూకిని తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగాయి. సెర్చ ఆపరేషన్ లో పాల్గొన్న కెనడియన్ P-8 విమానం ‘‘ప్రతి 30 నిమిషాలకు ఆ ప్రాంతంలో చప్పుడు శబ్దాలు వినబడుతున్నాయి. నాలుగు గంటల తర్వాత అదనపు సోనార్‌ని మోహరించారు. చప్పుడు ఇంకా వినబడుతోంది" అని యూఎస్  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు పంపిన అంతర్గత ఇమెయిల్ తెలిపిందని రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కథనం స్పష్టం చేసింది. అయితే ఆ శబ్దాలు మంగళవారం ఎప్పుడు వినిపించాయి, ఎంతసేపు, లేదా వాటికి కారణమేమిటో స్పష్టం చేయలేదు.

ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుండి రెండు మైళ్ల (దాదాపు నాలుగు కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరంలో ఉన్న బ్రిటిష్ ప్యాసింజర్ లైనర్ అవశేషాలను చూడటానికి ఆదివారం 21-అడుగుల (6.5-మీటర్లు) టైటాన్ అనే సబ్‌మెర్సిబుల్‌లో ముగ్గురు ప్రయాణికులు వెళ్లారు. అందులో బ్రిటీష్ బిలియనీర్ హోర్డింగ్, ఒక పాకిస్తానీ వ్యాపారవేత్త, అతని కుమారుడు ఉన్నారు. OceanGate ఎక్స్‌పెడిషన్స్ సబ్‌ ఒక్కో సీటు కోసం $250,000 వసూలు చేస్తుంది.  కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి దాదాపు 400 మైళ్ల దూరంలో డైవ్ చేసి వెళ్లిన సబ్ మెర్సిబుల్ కమ్యూనికేషన్ కట్ అయింది. దాని జాడ కోసం అమెరికా, కెనడియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, విమానాలు 7,600 చదరపు మైళ్ల పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com