శ్రీలీల సుడి అలా నడుస్తోంది మరి.!

- June 21, 2023 , by Maagulf
శ్రీలీల సుడి అలా నడుస్తోంది మరి.!

మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శ్రీలీలకు ప్రమోషన్ వచ్చినట్లయ్యింది. సెకండ్ హీరోయిన్ రోల్ కాస్తా.. ఫస్ట్ హీరోయిన్ అదేనండీ మెయిన్ లీడ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసేలా కనిపిస్తున్నాయ్ పరిస్థితులు.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తున్న పూజా హెగ్దే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సో, ఆ ప్లేస్‌ని శ్రీలీలతోనే రీ ప్లేస్ చేసేయబోతున్నారనీ వినికిడి. 

మరోవైపు మెయిన్ లీడ్‌లోకి ‘విరూపాక్ష’ బ్యూటీ సంయుక్తా మీనన్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఒకవేళ సంయుక్తని కూడా తీసుకుంటే, ఎవర్ని మెయిన్ లీడ్ చేస్తాడా.? గురూజీ అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com