రోడ్డు ప్రమాదంలో భారతీయుని మృతి
- May 13, 2016
మనామా: గురువారం ఒక ట్రక్ డీ కొట్టి వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయన బాధితుడు భారత దేశానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో ఒక భారీ ట్రక్ అతనిని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, భారీ ట్రక్ అతని తలని ముక్కలు ముక్కలుగా చితకకోట్టింది. సలమాబాద్ ప్రాంతంలో మరణించిన వ్యక్తి శిబు, 42, బహరేన్ ఆక్వా కూల్ సంస్థలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దారుణం సంభవించింది. ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జరిగింది. శిబు భారతదేశంలోని కేరళ రాష్ట్రం యొక్క పతనంతిట్ట జిల్లాలో తిరువల్ల ప్రాంతానికి చెందినవాడు.
భారతదేశం లో ఉన్న తన భార్య మరియు పిల్లలను వదిలి బతుకుతెరువు కోసం వచ్చాడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శిబు కొద్ది నెలల క్రితం ఆక్వా కూల్ లో పనికి ముందు గుడైబియ లో ఒక శుభ్రపరచడం మరియు నిర్వహణ సంస్థ లో పని చేసినట్లు డి టి వార్తలలో తెలిపారు.
సల్మనియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) మృతదేహాలను భద్రపరిచే చోట శిబు మృతదేహం ఉంచబడింది. అధికారిక లాంచనాలు పూర్తి కాబడిన తర్వాత అతని పార్ధివ దేహాన్ని తన స్వస్థలమైన భారతదేశం కు చేయబడుతుంది. శిబు రెండు దశాబ్దాలకు పైగా బహ్రెయిన్ లో ఒక ప్రవాసీయుడిగా జీవితం గడుపుతున్నారు. ఆయన సోదరుడు అనిల్ ఐదేళ్ల పాటు బహరేన్ లో పని చేసి ఇప్పుడు భారతదేశంలో స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







