' సంజోష్ ఆడియో ఆల్బమ్ లాంచ్ '
- May 13, 2016
ACS ఎంటర్ టైన్మెంట్ తగరం అంకయ్య చిన్నక్క సమర్పణలో సంగీత దర్శకుడు సంజోష్ సంగీత సారధ్యంలో రూపోందిన ‘సంజోష్ మ్యూజిక్ అల్బమ్ ఆవిష్కరణ హైద్రాబాద్ ఫిల్మ్ చాంబర్ లో జరిగింది.మహేష్ నిర్మించిన ఈ ఆడియో అల్బమ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణా ఫిలిం చాంబర్ అసోసియేషన్ అద్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆడియో సీడిని ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కు అందజేశారు.ఈసందర్భంగా
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ... సంజోష్ గతంలో "సాధన " అనే సినిమా కి మ్యూజిక్ ను అందించాడు. సినిమా అవకాశాలు రాలేదని అదైర్య పడకుండా ఇలాంటి అల్బమ్ లను చేయటం శుభ పరిణామం అన్నారు. మ్యూజిక్ పై పట్టున్న సంజోష్ అల్బమ్ కు మంచి పేరు రావాలని , ఇండస్ట్రీ లో సక్సెస్ ను అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు..
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ... సినిమా అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఇలాంటి అల్బమ్ లను చేయటం వలన మంచి పేరు తో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తాయి. ఈ అల్బమ్ లో ఫోక్ , క్లాసిక్ పాటలు అందరికీ నచ్చుతాయి.
సంజోష్ మాట్లాడుతూ ... సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. నా మిత్రుడి సహకారంతో ఈ అల్బమ్ ను రూపొందించాను. ఈ అల్బమ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శక నిర్మాతలు అవకాశం కలిపిస్తే 1 సిచ్చ్యుయేషన్ కి వంద ట్యూన్స్ కట్టగలనని అన్నారు..
నిర్మాత మహేష్ మాట్లాడుతూ ... చాలా కాలంగా సంజోష్ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు ....అతనిలోని టాలెంట్ చూసి ఈ అల్బమ్ చేయడానికి ముందుకొచ్చానని అన్నారు..భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతాడనే నమ్మకం ఉందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్ , ACS ఎంటర్ టైన్మెంట్ పాల్గోన్నారు.....
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







