విల్లాకు Dh23,000 విద్యుత్ బిల్లు.. క్రైం ముఠా గుట్టురట్టు
- June 22, 2023
యూఏఈ: ఫుజైరాలోని రెండు రెసిడెన్షియల్ విల్లాల్లో అధిక విద్యుత్ బిల్లు ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న మోసాన్ని బయటపెట్టింది. వాస్తవానికి సదరు విల్లాలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే అద్దెకు ఉంటారు. అయితే, అధిక విద్యుత్ బిల్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వ్యవస్థీకృత క్రైమ్ గ్రూప్ విషయం బయటికొచ్చింది. విల్లాలో ఎలక్ట్రానిక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కార్యకలాపాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ బృందం నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి, బాధితులకు భారీ లాభాలను తిరిగి ఇవ్వగలమని పేర్కొంటూ వారి నుండి డబ్బును వసూలు చేస్తుంది. విల్లాలపై దాడి సందర్భంగా అధికారులు భారీగా కంప్యూటర్లు, ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. కేసును విచారించిన ఫుజైరా ఫెడరల్ కోర్టు ఆసియన్ జాతీయతకు చెందిన 10 మంది నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష, 5 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వారి నివాసాన్ని స్పాన్సర్ చేసిన వాణిజ్య సంస్థకు 5 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా విధించబడింది. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనధికార పార్టీలతో సంబంధాలను పెట్టుకోవద్దని కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







