కీలకమైన అబుధాబి వంతెనపై కొత్త వేగ పరిమితి
- June 22, 2023
యూఏఈ: జూన్ 23 నుండి అబుధాబిలోని అల్ సాదా బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నందున కొత్త వేగ పరిమితిని విధించారు. ఇది డిసెంబర్ 2023 చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఎమిరేట్ రవాణా అథారిటీ బుధవారం ప్రకటించింది. శుక్రవారం నుంచి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్‌లోని వంతెనకు ఇరువైపులా వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించినట్టు అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ITC) తెలిపింది. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని తెలిపింది. "ఇది రద్దీని తగ్గించడానికి, ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి మాకు సహాయపడుతుంది" అని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







