ఏపీ, తెలంగాణల్లో పరిస్థితి తారుమారైంది: సిఎం కెసిఆర్
- June 22, 2023
హైదరాబాద్: గతంలో ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనవచ్చునని చంద్రబాబు చెప్పేవారని, ఇప్పుడు భూముల ధరల విషయంలో ఏపీ, తెలంగాణలో పరిస్థితి తారుమారైందని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. పటాన్ చెరులో రూ.183 కోట్లతో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో గత కొన్నేళ్లలో భూముల ధరలు భారీగా పెరిగాయని, ఏపీలో తగ్గాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారని, మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే సంగారెడ్డి నుండి హయత్ నగర్ కు మెట్రో వస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్ కు రూ.10 కోట్లు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని, దీనిని నెరవేరుస్తామన్నారు. పటాన్ చెరు వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పని చేస్తున్నారన్నారు. గతంలో పటాన్ చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయన్నారు. పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐదు పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







