సౌత్‌లో పూజా హెగ్దే కళ తగ్గుతోందా.?

- June 22, 2023 , by Maagulf
సౌత్‌లో పూజా హెగ్దే కళ తగ్గుతోందా.?

బుట్టబొమ్మ పూజా హెగ్ధే‌కి సౌత్‌లో కళ తగ్గుతోందా.? అంటే అవునన అంటున్నాయ్ సౌత్ సినీ వర్గాలు. తెలుగు విషయానికి వస్తే, ఈ మధ్య రెండు బిగ్గెస్ట్ ఆఫర్లు పూజా హెగ్ధే చేయి దాటిపోయాయ్. అందులో పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలుండడం విశేషం.
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మొదట పూజా హెగ్ధేనే అనుకున్నారు. అయితే, ఆ ప్లేస్‌లో శ్రీలీల ఫిక్సయిపోయింది.
అలాగే, తాజాగా త్రివిక్రమ్ - మహేష్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’ నుంచి కూడా పూజా హెగ్దే తప్పుకుంది. ఆ ఛాన్స్ కూడా శ్రీలీలనే కొట్టుకెళ్లిపోయింది. శ్రీలీల జోరు చూస్తుంటే, పూజా హెగ్ధే కెరీర్‌కి గట్టిగానే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. 
మరోవైపు, బాలీవుడ్‌లోనూ పూజా హెగ్ధే నటించిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దాంతో, పూజా హెగ్ధే కెరీర్ ప్రస్తుతం డైలామాలో పడ్డట్లే అంటున్నారు. చూడాలి మరి, ఈ పరిస్థితి నుంచి బుట్టబొమ్మ ఎలా గట్టెక్కుతుందో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com