స్పై ఏజెంట్‌గా అఖిల్ ఫెయిల్.! నిఖిల్ ఏం చేస్తాడో.!

- June 23, 2023 , by Maagulf
స్పై ఏజెంట్‌గా అఖిల్ ఫెయిల్.! నిఖిల్ ఏం చేస్తాడో.!

నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘స్పై’ ఈ నెల 29న తెలుగుతో పాటూ పలు భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంతో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్ స్పై‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని ఛేదించే కథనంతో ఈ సినిమా రూపొందబోతోందనీ టీజర్‌తోనే రివీల్ చేశారు.
ట్రైలర్‌తో ఇంకాస్త హింట్ ఇచ్చారు. ‘చరిత్ర మనకి అన్నీ నిజాలు చెప్పదు. దాస్తుంది. వాటికి సమాధానం మనమే వెతకాలి..’ అంటూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. నేతాజీకి సంబంధించిన ఫైల్స్‌ని దొంగిలించిన టెర్రరిస్త్‌తో కలిసి ఓ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు నిఖిల్.
ఈ క్రమంలో నేతాజీ మరణానికి సంబంధించిన విషయాలే కాకుండా.. తన అన్న సుభాష్ చావుకు గల కారణాలు కూడా తెలుసుకుంటుంటాడు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ చివర్లో రానా మరో స్పైగా కనిపించి సర్‌ప్రైజ్ చేస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి మార్కులు కొట్టేశాడు నిఖిల్. చూడాలి మరి, రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా వుండబోతోందో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com