భుజం నొప్పి బాధిస్తోందా.?

- June 23, 2023 , by Maagulf
భుజం నొప్పి బాధిస్తోందా.?

భుజం నొప్పి అనేది సర్వ సాధారణమైనదే. కానీ, పడుకోవడం తేడా వల్లనో లేక బరువైన వస్తువుల్ని ఎత్తడం వల్లనో వచ్చే నొప్పి కొన్ని రోజులుండి తగ్గిపోతుంది. కానీ, కొందరిలో భుజం నొప్పి దీర్ఘ కాలం వేధిస్తుంటుంది. 
ఇలా వుంటే, ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి. దీర్ఘ కాలిక భుజం నొప్పి డయాబెటిస్‌ని సూచిస్తుంది. సో, అస్సలు అశ్రద్ధ చేయకూడదనీ అంటున్నారు. విచ్చల విడిగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది.
వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రాధమికంగా తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఇంటి చిట్కాలు కూడా భుజం నొప్పికి కొంత ఉపశమనం అందిస్తాయ్. 
మార్కెట్‌లో ఎప్సమ్ సాల్ట్ అని అడిగితే ఇస్తారు. దాన్ని వేసుకుని వేడి నీళ్ల స్నానం చేస్తే కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.అలాగే ఐస్ ప్యాక్‌తో నొప్పి వున్న చోట మసాజ్ చేసినా ఉపశమనం లభిస్తుంది. 
ఏది ఏమైనా భుజం నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయరాదు. ఎక్కువ కాలం అలాగే అశ్రద్ధ చేస్తే అక్కడి కండరాలు పూర్తిగా కుంచించుకుపోయే ప్రమాదముంది. వైద్యుని పర్యవేక్షణలో షుగర్ టెస్ట్ చేయించుకుని, తగు వైద్య చికిత్స చేయించుకోవడంతో పాటూ, ఈ ఇంటి చిట్కాలను కూడా పాఠించడం మంచిదని నిపుణుల సలహా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com