భుజం నొప్పి బాధిస్తోందా.?
- June 23, 2023
భుజం నొప్పి అనేది సర్వ సాధారణమైనదే. కానీ, పడుకోవడం తేడా వల్లనో లేక బరువైన వస్తువుల్ని ఎత్తడం వల్లనో వచ్చే నొప్పి కొన్ని రోజులుండి తగ్గిపోతుంది. కానీ, కొందరిలో భుజం నొప్పి దీర్ఘ కాలం వేధిస్తుంటుంది.
ఇలా వుంటే, ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి. దీర్ఘ కాలిక భుజం నొప్పి డయాబెటిస్‌ని సూచిస్తుంది. సో, అస్సలు అశ్రద్ధ చేయకూడదనీ అంటున్నారు. విచ్చల విడిగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది.
వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రాధమికంగా తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఇంటి చిట్కాలు కూడా భుజం నొప్పికి కొంత ఉపశమనం అందిస్తాయ్.
మార్కెట్లో ఎప్సమ్ సాల్ట్ అని అడిగితే ఇస్తారు. దాన్ని వేసుకుని వేడి నీళ్ల స్నానం చేస్తే కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.అలాగే ఐస్ ప్యాక్‌తో నొప్పి వున్న చోట మసాజ్ చేసినా ఉపశమనం లభిస్తుంది.
ఏది ఏమైనా భుజం నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయరాదు. ఎక్కువ కాలం అలాగే అశ్రద్ధ చేస్తే అక్కడి కండరాలు పూర్తిగా కుంచించుకుపోయే ప్రమాదముంది. వైద్యుని పర్యవేక్షణలో షుగర్ టెస్ట్ చేయించుకుని, తగు వైద్య చికిత్స చేయించుకోవడంతో పాటూ, ఈ ఇంటి చిట్కాలను కూడా పాఠించడం మంచిదని నిపుణుల సలహా.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







