ఆర్జీవీ 'వ్యూహం' టీజర్ విడుదల...
- June 24, 2023
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ‘లక్మిస్ ఎన్టీఆర్’ సినిమా తీసి సంచలనం సృష్టించాడు. అప్పటిలో ఆ సినిమా సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ ఎన్నికల సమయంలో.. ‘వ్యూహం’, ‘శపథం’ అనే చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తానని ప్రకటించాడు. వ్యోహహం సినిమాని రెండు పార్టులుగా తీస్తానని, మొదటి పార్ట్ లో YSR మరణం తర్వాత జరిగిన సన్నివేశాలు, రెండో పార్ట్ లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేవి చూపిస్తానని తెలిపాడు ఆర్జీవీ.
ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన RGV శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ఇప్పటికే మూవీలోని ముఖ్య పాత్రల పిక్స్ ని షేర్ చేసి సంచలనం సృష్టించాడు. సినిమా షూటింగ్ కూడా అదాదాపు 30 శాతం పూర్తయింది. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు ఆర్జీవీ. టీజర్ లో.. YSR హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు చూపించారు. చివర్లో జగన్.. నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్ తో టీజర్ ని వైరల్ చేశారు. ప్రస్తుతం వ్యూహం టీజర్ ట్రెండింగ్ లో ఉంది.
టీజర్ మాత్రం అదిరిపోయిందని ముఖ్యంగా బైక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలకి సంబంధించిన వాళ్ళు అప్పుడే వ్యూహం టీజర్ ని విమర్శించడం మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







