ఒమన్ లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- June 24, 2023
మస్కట్: మస్కట్ లోని ఘలా ఏరియాలోని రాయల్ హాస్పిటల్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ నందు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భారత జాగృతి ఒమాన్, బీర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ వారు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరులని సంస్కరించుకుంటు రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో తెలంగాణ నుండే కాకుండా భారతదేశంలోని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యువకులు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని కార్యనిర్వాహకులు తెలిపారు.
రక్త దానం కార్యక్రమం అనంతరం మిఠాయిలు, కేక్ కట్ చేసి తెలంగాణ ధశాబ్ది ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తేలిపరు .ఈ కార్యక్రమంలో భారత జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్ రెడ్డి, భారత్ జాగృతి ఒమాన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్,బీఆరేస్ ఒమాన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేష్, భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్,కార్యదర్శులు సాయి రాజు, రాజేందర్, వంశీ, రంజిత్,ప్రమోద్ రెడ్డి, విజయ్,మెడ పట్ల లక్ష్మణ్ ,జగన్,కొయ్యాడి వంశీ ,మంత్రి గోపాల్ ,రంజిత్ కశామొల్ల,కొమురయ్య,వేణు,రాజు, నరేష్ ,రాజేందర్,రంజిత్,శ్రీనివాస్ నేత,అక్తర్,జంబుకా శ్రీనివాస్,గంగాధర్,ప్రదీప్,సుమన్,నాగరాజు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)


తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







