గుండె నొప్పి వున్న వాళ్లు వ్యాయాయం చేయవచ్చా.?
- June 24, 2023
గుండెనొప్పితో బాధపడేవారు వ్యాయాయం చేయకూడదని అంటారు. ఎందుకంటే వ్యాయాయం చేయడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువవుతుంది. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రాణాపాయ ప్రమాదమొచ్చే అవకాశాలున్నాయని గుండెనొప్పి వున్న వాళ్లు వ్యాయామానికి దూరంగా వుండాలని చెబుతారు.
అయితే, అలాంటి అనుమానమేం అవసరం లేదనీ, ఎక్కువ ఒత్తిడి లేని చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చని కార్డియాక్ నిపుణులు చెబుతున్నారు.
అంటే, రన్నింగ్, జాగింగ్ లాంటివి కాకుండా, స్లో వాకింగ్ చేయొచ్చు. అలాగే, యోగా కూడా నిరభ్యంతరంగా చేయొచ్చు. కూర్చుని వేయగలిగే కొన్ని చిన్న చిన్న ఆసనాలు కూడా వేసుకోవచ్చు.
బరువులు ఎత్తడంలాంటివి చేయకుండా, చేతులు, కాళ్లూ ఫ్రీగా కదపగలిగే వ్యాయామాలేవైనా చేయొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
గుండె సంబంధిత సమస్యలున్నాయని మరీ ఖాళీగా తిని కూర్చున్నా ప్రమాదమే. గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. అలా కూడా హార్ట్ స్ర్టోక్ వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







