‘భోళా శంకర్’ టీజర్ విడుదల..
- June 24, 2023
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. కీర్తి సురేష్ ఇందులో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. సుశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
భోళా శంకర్ సినిమా తమిళ్ లో అజిత్ చేసిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక భోళా శంకర్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చిరు తెలంగాణ భాషలో క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో ఫుల్ మాస్ గా చిరుని చూపించారు. చివర్లో స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్ళే అంటూ డైలాగ్ అదరగొట్టారు మెగాస్టార్.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







