కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీకి Dh1.075 మిలియన్ జరిమానా
- June 25, 2023
దుబాయ్: కార్మికుల జీతాలు చెల్లించడంలో విఫలమైనందుకు దుబాయ్‌లో ఉన్న నిర్మాణ సంస్థ యజమానికి 1.075 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు ఎమిరేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.దుబాయ్ నేచురలైజేషన్ మరియు రెసిడెన్సీ ప్రాసిక్యూషన్ కంపెనీ డైరెక్టర్‌ను కోర్టు విచారించింది. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంపై అతనిపై అభియోగాలు మోపింది. సంస్థలోని 215 మంది కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిజం అని తేలింది. కంపెనీలో ఆర్థిక సవాళ్ల కారణంగా తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని నిందితులు అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. కేసును విచారించిన తర్వాత కోర్టు ప్రతి కార్మికునికి Dh5,000 జరిమానా(మొత్తం Dh1.075-మిలియన్ పెనాల్టీ) చెల్లించాలని కంపెనీ యజమానిని ఆదేశించింది.
తాజా వార్తలు
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..
- బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!