రష్యాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందాం: వాగ్నర్ గ్రూప్
- June 24, 2023
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగరేసిన.. యెవ్‌జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించిన కాసేపటికే.... వాగ్నర్ గ్రూప్ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాకు తాను ద్రోహం చేశానన్నపుతిన్ వ్యాఖ్యలను ప్రిగోజిన్ ఖండించారు. తన తరఫున పోరాటం చేస్తున్న వారిని దేశ భక్తులుగా ప్రిగోజిన్ పేర్కొన్నారు. దేశం అవినీతిలో కూరుకుపోతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని.. పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.పుతిన్‌పై తిరుగుబావుటా ఎగరేసిన వాగ్నర్ ప్రైవేట్ సైన్యం... ఇప్పటికే రెండు కీలకమైన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. రోస్టోవ్ ఆన్ డాన్, వొరోనెజ్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించాడు. ప్రిగోజిన్ యుద్ధం ప్రకటించడంపై... పుతిన్ మండిపడుతున్నారు. ప్రిగోజిన్ నిర్ణయాన్ని... దేశద్రోహంగా, వెన్నుపోటు చర్యగా పుతిన్ అభివర్ణించారు. తీవ్రమైన నేరపూరిత సాహసానికి ప్రిగోజిన్ ఒడిగట్టారని వ్యాఖ్యానించారు. సాయుధ తిరుగుబాటును.... తీవ్రమైన నేరంగా పుతిన్ అభివర్ణించారు. తిరుగుబాటుదారుల నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తిరుగుబాటు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







