త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 ప్రారంభిస్తాం

- June 25, 2023 , by Maagulf
త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 ప్రారంభిస్తాం

న్యూఢిల్లీ: కొత్త, అప్‌గ్రేడ్ చేసిన ఈ-పాస్‌పోర్ట్‌లతో కూడిన పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (PSP-వెర్షన్ 2.0) యొక్క రెండవ దశను భారత్  త్వరలో ప్రారంభించనుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా తెలిపారు. ప్రజలకు పాస్‌పోర్ట్, సంబంధిత సేవలను సకాలంలో, విశ్వసనీయంగా, అందుబాటులోకి, పారదర్శకంగా, సమర్ధవంతంగా అందజేస్తామని ప్రతిజ్ఞను పునరుద్ధరించడంలో తనతో చేరాలని విదేశాలలో పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారులను జైశంకర్ పిలుపునిచ్చారు.  పాస్‌పోర్ట్ సేవా దివస్ 2023 సందర్భంగా భారత్.. విదేశాలలో పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారులందరికీ,  సెంట్రల్ పాస్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లోని వారి సహచరులకు అభినందనలు తెలియజేయడం సంతోషకరమైన విషయమని జైశంకర్ అన్నారు.  ఈ మేరకు ట్వీట్ చేశారు. మంత్రిత్వ శాఖ 2022లో రికార్డు స్థాయిలో 13.32 మిలియన్ల పాస్‌పోర్ట్‌లు మరియు ఇతర సేవలను ప్రాసెస్ చేసిందని, ఇది 2021తో పోలిస్తే 63 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యం అయిన 'డిజిటల్ ఇండియా' దిశగా పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) గణనీయంగా దోహదపడిందని జైశంకర్ తన సందేశంలో పేర్కొన్నారు.  2014లో దేశంలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) ఉండగా, ఈ సంఖ్య 7 రెట్లు పెరిగి నేడు 523కి చేరుకుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com