రద్దీ సమయంలో సెకన్లలో పాస్‌పోర్ట్ క్లియర్ చేయడం ఎలా?
- June 25, 2023
యూఏఈ: ఈ ఏడాది ప్రథమార్థంలో 26 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) పాస్‌పోర్ట్ నియంత్రణను దాటారు. వీరిలో 36 శాతం లేదా 9 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ప్రక్రియను సెకన్లలో పూర్తి చేయడానికి స్మార్ట్ గేట్లను ఉపయోగించారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకటించింది. DXB వెబ్సైట్ ప్రకారం..స్మార్ట్ గేట్లు కొత్త కాంటాక్ట్‌లెస్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు పత్రాలను స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం సెకన్లలో దాటే అవకాశం ఉంది. ప్రయాణికులు మాస్క్‌లు, అద్దాలు, టోపీలతో సహా తమ ముఖాలను కప్పి ఉంచే ఏదైనా వస్తువును తప్పనిసరిగా తీసివేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈద్ అల్ అదా మరియు వేసవి సెలవుల సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో ప్రయాణికులను స్వీకరించేందుకు DXB వద్ద పాస్‌పోర్ట్ కౌంటర్లు, స్మార్ట్ గేట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
120 స్మార్ట్ గేట్లు
ఎయిర్పోర్ట్ పాస్‌పోర్ట్ అఫైర్స్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ అల్-శంకీతి మాట్లాడుతూ.. "ఆలస్యాన్ని నివారించడానికి అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు దీనిని స్వీకరించే లక్ష్యంతో స్మార్ట్ గేట్లలో సేవలను అభివృద్ధి చేయడానికి GDRAF నిరంతరం కృషి చేస్తోంది" అని అన్నారు. "మొదటి అర్ధ భాగంలో స్మార్ట్ గేట్ల వినియోగదారులు మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో 36 శాతం ఉన్నారు. మరియు సంవత్సరం చివరిలో వినియోగదారుల సంఖ్య 50 శాతానికి చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము" అని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..