హైస్కూల్ టాపర్‌ను ఆశ్చర్యానికి గురిచేసిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్

- June 26, 2023 , by Maagulf
హైస్కూల్ టాపర్‌ను ఆశ్చర్యానికి గురిచేసిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్

యూఏఈ: యూఏఈ టాప్-స్కోరింగ్ హైస్కూల్ విద్యార్థి యాస్మిన్ మహమూద్ అబ్దుల్లా మహమ్మద్ అలీకి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఫోన్ కాల్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. 2022-23 అకడమిక్ టర్మ్ చివరిలో జరిగిన పాన్-యూఏఈ పబ్లిక్ పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన ఎమిరాటీతో తాను చేసిన ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్‌ను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

అనంతరం ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. ఆమె ఉన్నత విద్య కోసం ఏ కళాశాలకు వెళతారని అడిగినప్పుడు, విద్యార్థిని మూడు విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటానని చెప్పింది. అరబిక్, ఇంగ్లీష్, జర్మన్ భాషలను అనర్గళంగా మాట్లాడే యాస్మిన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవాలని ఆకాంక్షించింది. షేక్ మహ్మద్ విద్యార్థిని తన కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తూ ఫోన్ కాల్‌ను ముగించాడు.

యాస్మిన్ గతంలో ఖలీఫా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ షార్జాలో డ్యూయల్ క్రెడిట్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యింది. ఆమె ఫౌండర్ లీడర్స్ అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది.  యాస్మిన్ తన జీవితకాలం గుర్తుండిపోయే ఫోన్ కాల్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. షేక్‌ మహ్మద్‌ ప్రోత్సాహం అందించిన మాటలు మరింత రాణించేలా ప్రోత్సహిస్తాయని ఆమె అన్నారు. షేక్ మహమ్మద్ తన ట్వీట్‌లో గ్రాడ్యుయేట్లు, వారి తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com