మక్కా, మదీనాలో 81వేల యాత్రికులకు వైద్య సేవలు

- June 27, 2023 , by Maagulf
మక్కా, మదీనాలో 81వేల యాత్రికులకు వైద్య సేవలు

మినా: మక్కా, మదీనాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో జూన్ 19 నుండి మొత్తం 80,973 మంది యాత్రికులు వైద్య సంరక్షణ నుండి ప్రయోజనం పొందారని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ సేవల్లో 23 ఓపెన్-హార్ట్ సర్జరీలు, 168 కార్డియాక్ కాథెటర్లు, 464 డయాలసిస్ సెషన్‌లు,  41 ఎండోస్కోపీలు ఉన్నాయని పేర్కొంది. హజ్ సమయంలో వేడి వల్ల కలిగే ప్రమాదాల గురించి మంత్రిత్వ శాఖ యాత్రికులను అప్రమత్తం చేసింది.  గొడుగులను ఉపయోగించడం, పుష్కలంగా ద్రవాలు తాగడం, శారీరక శ్రమను నివారించడం, ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించడం వల్ల యాత్రికులను హీట్‌స్ట్రోక్ లేదా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, అరాఫత్‌లో నిర్వహించే ఆసుపత్రులు యాత్రికులకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జబల్ అల్-రహ్మా హాస్పిటల్, అరాఫత్ జనరల్ హాస్పిటల్, నమేరా హాస్పిటల్, ఈస్ట్ అరాఫత్ హాస్పిటల్, అలాగే ఒక ఫీల్డ్ హాస్పిటల్ మరియు 46 ఆరోగ్య కేంద్రాలు వివిధ వైద్య రంగాలలో నైపుణ్యం కలిగిన 1,700 మందికి పైగా సిబ్బందితో నిర్వహిస్తున్నట్ల తెలిపింది. నాలుగు ఆసుపత్రుల్లో 900 కంటే ఎక్కువ పడకలు సిద్ధం చేశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల మాదిరిగానే వడదెబ్బ, వేడి అలసట మరియు ఇతర అత్యవసర కేసులను డీల్ చేసేందుకు సన్నద్ధమయ్యామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com