చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
- June 27, 2023
న్యూఢిల్లీ: చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన ఆదేశాల మేరకు యాత్రను ఆపేశారు.
వారం రోజులుగా మంచు, వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ ధామ్ యాత్రను కొనసాగించాలని భక్తులను ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు రానున్న 24 గంటల్లో టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!