ఇమారా హెల్త్ కేర్‌లో ICBF వైద్య శిబిరం విజయవంతం

- June 27, 2023 , by Maagulf
ఇమారా హెల్త్ కేర్‌లో ICBF వైద్య శిబిరం విజయవంతం

ఖతార్: ఇమారా హెల్త్ కేర్‌లో ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నిర్వహించిన 45వ వైద్య శిబిరం విజయవంతం అయింది. దాదాపు 400 తక్కువ-ఆదాయ వ్యక్తులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. వైద్య శిబిరాన్ని ఇండియన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ HE ఛార్జ్ డి అఫైర్స్ ఏంజెలిన్ ప్రేమలత ప్రారంభించారు. సుమన్ సోంకర్ (ICBF సమన్వయ అధికారి) ఈవెంట్ ను పర్యవేక్షించారు. ఇంటర్నల్ మెడిసిన్, E.N.T, ఓరల్ స్క్రీనింగ్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ మరియు ఫిజియోథెరపీ విభాగం డాక్టర్లు అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. వైద్య శిబిరంలో ఫార్మసీ సేవలను Q లైఫ్ ఫార్మా, IPhAQ (ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఖతార్) అందించింది. ఈ ఈవెంట్‌లో సుమారు 20 మంది విద్యార్థి వాలంటీర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా అల్ ఇమారా మెడికల్ సెంటర్‌ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అష్రఫ్ చెరకల్, చైర్మన్ డాక్టర్ అమీన్ లకు ICBF సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శిబిరాన్ని సందర్శించిన అపెక్స్ బాడీ అధ్యక్షులు, సంఘం నాయకులు, ICBF సలహా మండలి సభ్యులు, AO అధ్యక్షులు మద్దతు తెలిపారు. ఈ వైద్య శిబిరం విజయవంతం కావడం ఐక్యత, కరుణ, స్వచ్ఛంద సేవా శక్తికి నిదర్శనమని ICBF ఒక ప్రకటనలో పేర్కొంది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com