సౌదీలో భానుడి ఉగ్రరూపం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక

- June 27, 2023 , by Maagulf
సౌదీలో భానుడి ఉగ్రరూపం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక

మినా: ఈ సంవత్సరం హజ్ సీజన్ 1444 AH సమయంలో వేడి సంబంధిత ప్రమాదాల గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాత్రికులను అప్రమత్తం చేసింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా యాత్రికుల ఆరోగ్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బయటికి వచ్చిన సమయంలో గొడుగులను ఉపయోగించాలని, ద్రవ పధార్థాలను పుష్కలంగా తాగాలని, శారీరక శ్రమను ఎక్కువగా చేయవద్దని, ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించడం వల్ల యాత్రికులు తమను తాము హీట్‌స్ట్రోక్ లేదా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర సమయంలో ఆరోగ్య కాల్ సెంటర్ (937) యాత్రికుల ఆరోగ్య సందేహాలను పరిష్కరిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  అదేవిధంగా పవిత్ర ప్రదేశాలలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వైద్య సేవలు అవసరమైన యాత్రికులు వారిని సంప్రదించాలని సూచించింది. ఈ వైద్య కేంద్రాలు 24/7 పని చేస్తాయని, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్, ఇండోనేషియన్, టర్కిష్ మరియు పర్షియన్ వంటి బహుళ భాషలలో ప్రావీణ్యం కలిగిన సిబ్బందిని నియమించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com