విద్యార్థులకు జీనోమ్ సైన్స్ గురించి తెలిపే యాప్ ప్రారంభం
- June 27, 2023
దోహా: ఖతార్ ఫౌండేషన్ 'జీనోమ్ హీరోస్' అనే మొబైల్ గేమ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నపిల్లలు జీనోమ్ సైన్స్ గురించి సరదాగా, ఇంటరాక్టివ్‌గా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఖతార్ ఫౌండేషన్ పాఠశాలల విద్యార్థుల మద్దతుతో QF ఖతార్ జీనోమ్ ప్రోగ్రామ్ రూపొందించిన కొత్త అప్లికేషన్ ఇప్పుడు Apple స్టోర్ మరియు Google Playలో ఇంగ్లీష్, అరబిక్‌లో అందుబాటులో ఉంది. జీనోమ్ హీరోస్ అప్లికేషన్ ప్రారంభం నుండి దాని కోసం సహకరిస్తున్న 120 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో QF ఖతార్ అకాడమీ దోహాలో ఈ అప్లికేషన్ ఇటీవల ప్రారంభించబడింది. Genome Heroes గేమ్ అప్లికేషన్ గ్లోకలైజ్డ్ అప్రోచ్, గ్రాఫిక్స్, ఎంగేజింగ్ స్టోరీ నుండి పుట్టి పిల్లలకు కణాలు, DNA మరియు వంశపారంపర్యతను పరిచయం చేస్తుందని ఖతార్ జీనోమ్ ప్రోగ్రామ్‌లోని జెనోమిక్ ఎడ్యుకేషన్ హెడ్, గేమ్ సృష్టికర్త డిమా డార్విష్ వెల్లడించారు. ఖతార్ అకాడమీ దోహా 4, 5 మరియు 6 తరగతుల విద్యార్థులు గేమ్ అప్లికేషన్ టెస్టింగ్, పైలట్ దశలో చురుకుగా పాల్గొన్నారని తెలియజేశారు. 'జీనోమ్ హీరోస్' యాప్ 6, 9 సంవత్సరాల మధ్య చదివే వారికి.. 9 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సరిపోయే రెండు వేర్వేరు స్థాయిలలో రూపొందించబడిందన్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







