సొరకాయతో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్.!

- June 27, 2023 , by Maagulf
సొరకాయతో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్.!

అన్నింటికీ మందులే వాడాలంటే కుదరదు. శరీరం సహకరించదు. కొన్ని రకాల ఇంటి చిట్కాలు కూడా కొన్నింటికి చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా కూరగాయలతోనే చాలా వరకూ అనారోగ్య సమస్యలు నియంత్రించేయొచ్చని ఆహార నిపుణుల వాదన.
ప్రస్తుతం యూరిక్ యాసిడ్ సమస్య సిటీ వాసుల్ని కలవరపెడుతోంది. పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మంగ్ తదితర అంశాలు ఈ యూరిక్ యాసిడ్ సమస్యకు కారణాలు. 
విపరీతమైన కీళ్ల నొప్పులు, పాదాల్లో వాపులు.. తదితర సమస్యలు యూరిక్ యాసిడ్ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న అనారోగ్య సమస్యలు.
వీటికి సొరకాయ మంచి ఔషధంగా చెబుతున్నారు. రెగ్యలర్‌గా ఫుడ్‌లో దీన్ని భాగం చేసుకుంటే, చాలా వరకూ యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడొచ్చనీ ఈ మధ్య ఓ అధ్యయనంలో తేలింది.
సొరకాయలో వుండే విటమిన్ బి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయుల్ని నియంత్రణలో వుంచుతుందట. అలాగే, సొరకాయను ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు సమస్య, డయాబెటిస్ సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. తీవ్రమైన యూరిక్ యాసిడ్ సమస్య వున్న వాళ్లకు సొరకాయ రసం ఎక్కువ ఫలితం ఇస్తుందట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com