స్వీట్ వార్నింగ్.! కొంచెం తగ్గాలయ్యా నిఖిలూ.!
- June 27, 2023
నిఖిల్ జోరు బాగా పెరిగింది. అనూహ్యంగా ప్యాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకున్నాడు నిఖిల్. ‘ కార్తికేయ 2’ సినిమాతో అది సాధ్యమైంది నిఖిల్ సిద్ధార్ధకి.
అయితే, తాజాగా నిఖిల్ తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ కొంచెం తగ్గి వున్న నిఖిల్ ఎందుకో సడెన్‌గా కాస్త అతి చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
ఇకపై తన నుంచి వచ్చే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే అని అధికారికంగా ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ఈ ప్రకటనే నిఖిల్ అతిని బయట పెట్టిన అంశం.
ప్రస్తుతం ‘స్పై’ మూవీ ప్రమోషన్లతో బిజీగా వున్నాడు నిఖిల్. ఇది ప్యాన్ ఇండియా సినిమానే. ఓకే ఈ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి, దీన్ని ఆ లిస్టులో వేయొచ్చు. కానీ, తర్వాత వచ్చే వాటి ముచ్చట కూడా ఇప్పుడే కన్‌ఫామ్ చేస్తే ఎలా.?
అంతా మంచే జరిగి, ‘స్పై’ హిట్ అయితే ఫర్వాలేదు. కానీ, ఏమైనా తేడా కొట్టిందంటే నిఖిల్ పరిస్థితి ఏంటీ.? సో, కాస్త తగ్గితే మంచిదని నిఖిల్‌కి ఆయన సన్నిహితులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







